చివరిగా అప్‌డేట్ చేసింది: January 21, 2022
మీరు మా వెబ్‌సైట్‌ని ఉపయోగించినప్పుడు, కొన్ని సందర్భాల్లో మేం మీ పేరు మరియు సంప్రదింపు వివరాలు (ఇ-మెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబర్ మరియు పోస్టల్ చిరునామా వంటివి) సేకరించే అవకాశం ఉంది. సమ్మతి లేకుండా ఈ సమాచారాన్ని మేం సేకరించం మరియు ఆన్‌లైన్ ప్రకటనల ప్లేస్‌మెంట్‌లో దీన్ని ఎప్పటికీ ఉపయోగించం. మీరు స్వచ్ఛందంగా మీ పేరు మరియు సంప్రదింపు వివరాలను అందించే ఉదాహరణల్లో ఇవి కూడా ఉంటాయి:
అభ్యర్థనలకు ప్రతిస్పందించడం: యూజర్ అభ్యర్థనకు ప్రతిస్పందించడానికి మాత్రమే, ఇమెయిల్ చిరునామా మరియు ఇతర సంప్రదింపు సమాచారంతో సహా, సమాచార రికార్డును మేం నిర్వహిస్తాము. ఉదాహరణకు మీరు “మమ్మల్ని సంప్రదించండి” లింక్‌పై క్లిక్ చేసి, ఒక ప్రశ్నను లేదా వ్యాఖ్యను సబ్మిట్ చేసినట్లయితే, మేం మీపేరు, ఇ-మెయిల్ చిరునామా, మరియు మీకు ప్రత్యుత్తరం పంపడానికి ఫోన్ నంబర్ సేకరిస్తాం.
మా న్యూస్ లెటర్ జాబితాకు జోడించాలని మీరు స్వచ్ఛందంగా కోరితే, మా ఇమెయిల్ న్యూస్ లెటర్ మీకు పంపడానికి మేం మీ ఇమెయిల్ చిరునామాను సేకరిస్తాము.
పైన పేర్కొన్న విధంగా, మీ సంప్రదింపు సమాచారాన్ని నమోదు చేయడం వలన, మీ అభ్యర్థనకు సంబంధించి మిమ్మల్ని సంప్రదించడానికి ఆ సమాచారం ఉపయోగించుకోవడానికి, మీరు Choreographకి సమ్మతి ఇచ్చినట్లు అవుతుంది. ఈ విధంగా సమాచారాన్ని ఉపయోగించడానికి ఈ సమ్మతి మాకు చట్టపరమైన ఆధారంగా ఉంటుంది.
మీరు ఎప్పుడైనా మీ సమ్మతిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే, మా మార్కెటింగ్ ఇ-మెయిల్‌ల నుండి లేదా న్యూస్ లెటర్ నుండి లేదా మా డేటాబేస్ నుండి మీ చందాను తీసివేయాలని మీరు కోరుకున్నట్లయితే, మీరు మీ వివరాలను ఉపయోగించి గ్లోబల్ గోప్యతా నోటీసులోని మమ్మల్ని సంప్రదించండి విభాగంలో మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా మరియు మీరు అభ్యర్థిస్తున్న మార్పులకు సంబంధించి స్పష్టమైన సూచనలను తప్పనిసరిగా చేర్చాలి. మీరు ఇ-మెయిల్ దిగువన ఉన్న “అన్ సబ్‌స్క్రయిబ్” లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇ-మెయిల్ న్యూస్ లెటర్ నుండి కూడా అన్‌సబ్‌స్క్రైబ్ చేయవచ్చు.
మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు లేదా మాకు సంప్రదింపు సమాచారాన్ని అందించినప్పుడు, Choreograph మీ వ్యక్తిగత డేటా (వర్తించే చట్టంలో నిర్వచించిన విధంగా ఈ పదం లేదా ఇదేవిధమైన పదం)కు బాధ్యత వహించే డేటా కంట్రోలర్ అవుతుంది.
భవిష్యత్ సందర్శనలలో మీరు ఇష్టపడే కంటెంట్‌ని అందించడం ద్వారా మీ వెబ్‌సైట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, మేం ఈ సమాచారంలో కొంత లేదా మొత్తం ఉపయోగిస్తాం. మా వెబ్‌సైట్ మీ అనుభవాన్ని అర్థం చేసుకోవడం మరియు మెరుగుపరచడంలో మాకు చట్టబద్ధమైన ఆసక్తి ఉండడమే ఈ రకమైన ప్రాసెసింగ్ కోసం మా చట్టబద్ధమైన ఆధారంగా ఉంటుంది.
కుకీలు మరియు పై సమాచారాన్ని మేం ఉపయోగించడానికి మీరు అంగీకరించకపోతే, మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్‌ల ద్వారా వాటి ఉపయోగించడాన్ని ఆపవచ్చు లేదా మీరు HERE నిలిపివేయడాన్ని ఎంచుకోవచ్చు. మీరు కుకీలను ఆమోదించరాదని ఎంచుకుంటే, నిర్దిష్ట వెబ్‌సైట్ ఫీచర్‌లు మేం ఉద్దేశించిన విధంగా పని చేయకపోవచ్చు.
కుక్కీలు అంటే ఏమిటి?
కుకీలు చిన్న మొత్తంలో సమాచారం ఉండే టెక్ట్స్ ఫైల్స్, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, మేం మీ కంప్యూటర్ లేదా పరికరంలోకి వాటిని డౌన్‌లోడ్ చేస్తాం. మేం తదుపరి సందర్శనలలో ఈ కుకీలను గుర్తించగలము మరియు అవి మిమ్మల్ని గుర్తుంచుకోవడానికి మాకు అనుమతిస్తాయి. కుకీలు అనేక రూపాల్లో ఉంటాయి, మేం సాధారణంగా ఈ సైట్‌లో ఉపయోగించే కుకీల రకాలు మరియు కేటగిరీలకు సంబంధించిన మరిన్ని వివరాలను దిగువన మీకు అందిస్తాము.
మొదటి మరియు తృతీయ-పక్ష కుకీలు –కుకీ మొదటి లేదా తృతీయపక్షానికి చెందినదైనా అది ఆ కుకీని ఉంచే డొమైన్‌ను సూచిస్తుంది. మొదటి-పక్షం కుకీలు యూజర్ సందర్శించే వెబ్‌సైట్ ద్వారా సెట్ చేసినవి, వెబ్‌సైట్ URL విండోలో ప్రదర్శించబడతాయి. ఉదా https://www.choreograph.com. తృతీయ-పక్ష కుకీలు యూజర్‌లు సందర్శించే వెబ్‌సైట్ కాకుండా వేరొక డొమైన్ ద్వారా సెట్ చేసిన కుకీలుగా ఉంటాయి. ఒక యూజర్ ఒక వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, ఆ వెబ్‌సైట్ ద్వారా వేరొక సంస్థ ద్వారా కుకీని సెట్ చేస్తే, అది తృతీయ-పక్ష కుకీ అవుతుంది.
సెషన్ కుకీ –ఈ కుకీలు బ్రౌజర్ సెషన్‌లో యూజర్‌ల చర్యలను లింక్ చేయడానికి వెబ్‌సైట్ ఆపరేటర్‌లను అనుమతిస్తాయి. యూజర్ బ్రౌజర్ విండోను తెరిచినప్పుడు బ్రౌజర్ సెషన్ ప్రారంభమవుతుంది మరియు వారు బ్రౌజర్ విండోను మూసివేసినప్పుడు పూర్తి అవుతుంది. సెషన్ కుకీలు తాత్కాలికంగా సృష్టించబడతాయి. మీరు బ్రౌజర్‌ను మూసివేసిన తర్వాత, అన్ని సెషన్ కుకీలు తొలగించబడతాయి.
మేము కుక్కీలను దేనికి ఉపయోగిస్తాము?
కుకీలు దిగువ పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందినవై ఉంటాయి. ఈ వెబ్‌సైట్ కాలానుగుణంగా, అన్ని కేటగిరీలకు చెందిన కుకీలను ఉపయోగిస్తుంది. అలాగే, మీరు ఇతర వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు, తృతీయ-పక్షం ద్వారా మీ కంప్యూటర్‌లో ఉంచిన లక్షిత కుకీల నుండి మేం డేటాను ఉపయోగిస్తాము.
నేను కుక్కీలను ఎలా తొలగించగలను?
మీరు ఇప్పటికే మీ కంప్యూటర్ లేదా పరికరంలో ఉన్న ఏవైనా కుకీలను తొలగించాలని అనుకుంటే, దయచేసి దిగువ వివరాలను చూడండి. కుకీప్రాధాన్యత కేంద్రం లో అదనపు వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఈ సైట్‌లో ఉపయోగించిన అన్ని కుకీలను ప్రదర్శిస్తుంది. మీరు భవిష్యత్తులో కుకీలను మీ కంప్యూటర్‌లో నిల్వ చేయడాన్ని ఆపివేయాలని అనుకుంటే, దయచేసి మీ బ్రౌజర్ మెనూలో “సహాయం” క్లిక్ చేయడం ద్వారా మీ బ్రౌజర్ తయారీదారుల సూచనలను చూడండి. కుకీల గురించిన అదనపు సమాచారం http://www.allaboutcookies.org/లో లభిస్తుంది మరియు ఆసక్తి ఆధారిత ప్రకటన కోసం కుకీల ఉపయోగం గురించి మీరు www.youronlinechoices.comలో లేదా http://optout.networkadvertising.org/?c=1లో తెలుసుకోవచ్చు.
మా కుకీలను తొలగించడం ద్వారా లేదా భవిష్యత్తు కుకీలను నిలిపివేయడం వల్ల మీరు నిర్దిష్ట ప్రాంతాలకు లేదా మా వెబ్‌సైట్ ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోలేకపోవచ్చు. మీరు కుకీలను తొలగించినా, కొత్త బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేసినా లేదా కొత్త కంప్యూటర్ తీసుకున్నా, ఈ సైట్‌కు తిరిగి రావడం ద్వారా నిలిపివేసే కుకీని రీసెట్ చేయాల్సి ఉంటుంది.
మేము ఈ క్రింది కుకీల వర్గాలను ఉపయోగిస్తాము:
ఖచ్చితంగా అవసరమైన కుక్కీలు
వెబ్‌సైట్ పని చేయడానికి ఈ కుకీలు అవసరం మరియు మా సిస్టమ్‌లలో స్విచ్ ఆఫ్ చేయలేం. ఇవి సాధారణంగా మీ గోప్యతా ప్రాధాన్యతలను సెట్ చేయడం, లాగిన్ చేయడం లేదా ఫారాలను పూరించడం వంటి సేవల కోసం చేసే అభ్యర్థనకు మీరు చేసిన చర్యలకు ప్రతిస్పందనగా మాత్రమే సెట్ చేయబడతాయి
ఈ కుకీలను నిరోధించడానికి లేదా వీటి గురించి అప్రమత్తం చేయడానికి మీరు మీ బ్రౌజర్‌ను సెట్ చేయవచ్చు, అయితే, అలాంటప్పుడు సైట్ లోని కొన్ని భాగాలు పనిచేయవు. వ్యక్తిగతంగా గుర్తించదగిన ఏ సమాచారాన్ని ఈ కుకీలు నిల్వ చేయవు.
పనితీరు కుక్కీలు
ఈ కుకీలు సందర్శనలు మరియు ట్రాఫిక్ మూలాలను లెక్కించడానికి మమ్మల్ని అనుమతిస్తాయి కాబట్టి, మేం మా సైట్ పనితీరును కొలవవచ్చు మరియు మెరుగుపరచవచ్చు. ఏ పేజీలు ఎక్కువగా మరియు తక్కువ జనాదరణ పొందాయో తెలుసుకోవడానికి మరియు సందర్శకులు సైట్‌లో ఎక్కడకు వెళుతున్నారనేది చూడటానికి అవి మాకు సాయపడతాయి.
ఈ కుకీలు సేకరించే మొత్తం సమాచారం సంగ్రహంగా ఉంటుంది అంటే అనామధేయంగా ఉంటుంది. మీరు ఈ కుకీలను అనుమతించకపోతే, మీరు మా సైట్‌ను ఎప్పుడు సందర్శించారో మాకు తెలియదు మరియు దాని పనితీరును పర్యవేక్షించడం సాధ్యం కాదు. అటువంటి కుకీలు Google Analytics అందించే తృతీయ-పక్ష కుకీలను చేర్చవచ్చు.
ఫంక్షనల్ కుక్కీలు
ఈ కుకీలు వెబ్‌సైట్‌కు మెరుగైన కార్యాచరణ మరియు వ్యక్తిగతీకరణను అందించడానికి వీలు కల్పిస్తాయి. అవి మా ద్వారా సెట్ చేసి ఉండవచ్చులేదా మేం మా పేజీలకు జోడించిన సేవలను అందించే తృతీయ-పక్షం ద్వారా సెట్ చేసి ఉండవచ్చు. ఉదాహరణకు, వీడియోను చూడటం లేదా బ్లాగ్‌లో వ్యాఖ్యానించడం వంటి మీరు కోరిన సేవలను అందించడంలో సహాయపడటానికి అవి ఉపయోగించవచ్చు. ఈ కుకీలు సేకరించే సమాచారం అనామధేయంగా ఉండవచ్చుమరియు అవి ఇతర వెబ్‌సైట్‌లకు మీ బ్రౌజింగ్ కార్యాచరణను ట్రాక్ చేయలేరు.
మీరు ఈ కుకీలను అనుమతించకపోతే, ఈ సేవలలో కొన్ని లేదా అన్నీ సరిగ్గా పని చేయకపోవచ్చు.
పిల్లలు & పిల్లల డేటా ద్వారా ఈ సైట్‌ని ఉపయోగించడం
పిల్లల గోప్యత విషయంలో మేం సున్నితంగా ఉంటాం. మా వెబ్‌సైట్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం అభివృద్ధి చేయలేదు లేదా నిర్దేశించలేదు. మా వెబ్‌సైట్ ద్వారా పిల్లలు తమ గురించిన సమాచారాన్ని అందించవద్దని మేం ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం. మీ పిల్లలు ఈ రకమైన సమాచారాన్ని అందించారని మీరు విశ్వసిస్తే మరియు దానిని మా డేటాబేస్ నుండి తొలగించాలని అనుకుంటే, మీరు మమ్మల్ని DPO@choreograph.comలో సంప్రదించవచ్చు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లల గురించి సమాచారాన్ని మేం సేకరించినట్లు మాకు తెలిస్తే, మేం దానిని తొలగిస్తాము.
మూడవ పక్షం సైట్‌లకు లింక్‌లు
మా వెబ్‌సైట్ నుండి మరొక వెబ్‌సైట్‌కి లింక్ చేయడం అది మా అనుబంధ సంస్థ అని లేదా ఆ వెబ్‌సైట్‌లకు అది మా ఆమోదాన్ని సూచించదు, మరియు మేం లింక్ చేసే తృతీయపార్టీ వెబ్‌సైట్‌లను మేం నియంత్రించం, లేదా వారి కంటెంట్ లేదా గోప్యతా విధానాలకు బాధ్యత వహించం. మీరు మరొక వెబ్‌సైట్‌కు లింక్‌ని అనుసరించిన తర్వాత, ఇకChoreograph గోప్యతా నోటీసు ఇక ఏమాత్రం వర్తించదు. మీరు సందర్శించే ఏదైనా వెబ్‌సైట్ గోప్యతా విధానాన్ని ఎల్లప్పుడూ చదవడం ముఖ్యం.